అమ్మాయిలకు ప్రవేశం కల్పించాలి

Saturday, November 15th, 2014, 04:49:50 AM IST


ఆలీగడ్ ముస్లీం యూనివర్శిటీ లైబ్రరీలోకి అమ్మాయిలకు కూడా ప్రవేశం కల్పించాలని అలహాబాద్ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్శిటీ ఉపకులపతి జమీరుద్దీన్ షా లైబ్రరీలోకి అమ్మాయిలకు ప్రవేశం కల్పిస్తే….. లైబ్రరీకి వచ్చే అబ్బాయిల సంఖ్య ఇప్పుడున్న దానికంటే నాలుగు రెట్లు పెరుగుతుందని పేర్కొన్నారని.. దానిపై కోర్టుకు సమాధానం ఇవ్వాలని ఉపకులపతిని కోరింది. అయితే.. లైబ్రరీలోకి ప్రవేశం విషయమై.. కోర్ట్ సుమోటోగా స్వీకరించేందుకు నిరాకరించడంతో.. సామాజిక ఉద్యమవేత్త దీక్షా ద్వివేదీ పిల్ ను దాఖలు చేసింది. ఈ పిల్ పై కోర్టు విచారణ జరిపి పై విధంగా తీర్పు ఇచ్చింది.