తెలంగాణలో నేడు భారీగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య..!

Monday, October 12th, 2020, 10:26:17 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి రెండు వేలలోపే కేసులు నమోదవుతుండగా నేడు ఆ సంఖ్య భారీగా తగ్గింది. అయితే గడిచిన 24 గంటలలో కేవలం 1,021 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో 6 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,214 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,13,084 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,87,342 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 24,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,228 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 30,210 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 35,77,261 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 87.91 శాతం ఉండగా, మరణాల రేటు 0.57% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.