తెలంగాణలో కరోనా విలయతాండవం.. నేడు ఒక్కరోజే 117 పాజిటివ్ కేసులు..!

Thursday, May 28th, 2020, 09:06:47 PM IST

తెలంగాణలో కరోనా విలయతాండవం సృష్టిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే నేడు కూడా కేసుల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు 117 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది.

అయితే రాష్ట్రంలో 66 కేసులు నమోదైతే, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి, వలస కూలీలకు కలిపి 51 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2256 కి చేరగా, 1345 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 844 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇటు మరణాల సంఖ్య మొత్తం 67కు చేరింది.