తెలంగాణలో కరోనా కల్లోలం.. నేడు ఒక్కరోజే 1,213 పాజిటివ్ కేసులు..!

Thursday, July 2nd, 2020, 10:54:37 PM IST

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా తాజాగా నేడు కూడా కొత్తగా మరో 1,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే కరోనా బారిన పడి నేడు మరో 8 మంది చనిపోగా, కరోనా నుంచి కోలుకుని నేడు ఒక్కరోజే 987 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే ఇవాళ ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 48 కేసులు, మేడ్చల్‌లో 54 కేసులు, ఖమ్మంలో 18 కేసులు, వరంగల్ రూరల్‌లో 10 కేసులు, వరంగల్ అర్బన్‌లో 9 కేసులు, నల్గొండలో 8 కేసులు, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెంలో 7 కేసులు, రాజన్న సిరిసిల్లలో 6 కేసులు, కరీంనగర్, మహబూబాబాద్, నిజామాబాద్‌లో 5 కేసులు, సూర్యాపేట, ములుగు, నిర్మల్‌లో 4 కేసులు, కామారెడ్డి, నారాయణపేటలో 2 కేసులు, గద్వాల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లో ఒక్కో కేసు నమోదు అయ్యింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,570కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 9,069 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 9,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 275కి చేరింది.
ఇదిలా ఉంటే ఈ రోజు మొత్తం 5,356 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 4,143 మందికి నెగిటివ్ రాగా, 1,213 మందికి పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 98,153 టెస్ట్‌లు చేశారు.