హెల్త్ బులెటిన్: తెలంగాణలో నేడు భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Monday, September 21st, 2020, 10:40:32 AM IST

తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్న నేపధ్యంలో నేడు కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో కేవలం 1,302 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా కరోనా కారణంగా నేడు మరో 9 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,230 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,72,608 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,41,930 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 29,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,042 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 31,095 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 25,19,315 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 82.22 శాతం ఉండగా, మరణాల రేటు 0.60% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.