హెల్త్ బులెటిన్: తెలంగాణలో నేడు భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Monday, September 28th, 2020, 09:10:41 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నేడు భారీగా తగ్గింది. గత కొద్ది రోజులుగా రోజుకు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తాజాగా గడిచిన 24 గంటలలో 1,378 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 7 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,932 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,211 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,56,431 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 29,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1107 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 35,465 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 28,86,334 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 83.55 శాతం ఉండగా, మరణాల రేటు 0.59% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.