ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు..!

Wednesday, April 28th, 2021, 10:09:56 PM IST

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండగా తాజాగా మునుపెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో 74,748 శాంపిల్స్‌ని పరీక్షించగా 14,669 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 71 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,69,544కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,07,611 మంది చికిత్స పొందుతుండగా 9,54,062 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 6,433 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,871కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,62,17,831 శాంపిల్స్ పరీక్షించారు.