ఏపీలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 14,792 పాజిటివ్ కేసులు..!

Thursday, April 29th, 2021, 09:00:05 PM IST

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండగా తాజాగా మునుపెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో 86,035 శాంపిల్స్‌ని పరీక్షించగా 14,792 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 57 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,84,336కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,14,158 మంది చికిత్స పొందుతుండగా 9,62,250 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 8,188 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,928కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,63,03,866 శాంపిల్స్ పరీక్షించారు.