తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..!

Friday, July 24th, 2020, 10:50:10 PM IST

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా తాజాగా నేడు 1,640 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే కరోనా బారిన పడి నేడు ఒక్కరోజే 8 మంది చనిపోగా, కరోనా నుంచి కోలుకుని నేడు ఒక్కరోజే 1,007 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,466కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 40,334 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 11,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 455కి చేరింది. ఇదిలా ఉంటే ఈ రోజు మొత్తం 15,445 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 1,640 మందికి పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,22,326 టెస్ట్‌లు చేశారు.