తెలంగాణలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..!

Friday, May 29th, 2020, 10:22:30 PM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూపోతుంది. అయితే నేడు రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవ్వడం తీవ్ర కలకలం రేపుతుంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం 169 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అయితే జీహెచ్ఎంసీలో 82 పాజిటివ్ కేసులు, రంగారెడ్డిలో 14 కేసులు, మెదక్, సంగారెడ్డిలో రెండేసి కేసులు నమోదు అయ్యాయి. ఇకపోతే వలస కూలీలలో 5 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి పాజిటివ్ అని తేలింది. ఇకపోతే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2425 కి చేరగా, 1381 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 973 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇటు మరణాల సంఖ్య మొత్తం 71కి చేరింది.