తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Tuesday, October 13th, 2020, 09:30:34 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి రెండు వేలలోపే కేసులు నమోదవుతుండగా రెండు రోజులుగా ఆ సంఖ్య భారీగా తగ్గింది. అయితే గడిచిన 24 గంటలలో కేవలం 1,708 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు మరో 5 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,009 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,792 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,89,351 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 24,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,233 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 46,835 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 36,24,096 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 88.15 శాతం ఉండగా, మరణాల రేటు 0.57% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.