ఏపీలో నేడు రికార్డ్ స్థాయిలో నమోదైన కరోనా కేసులు..!

Friday, April 30th, 2021, 09:00:58 PM IST

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండగా తాజాగా మునుపెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో 86,494 శాంపిల్స్‌ని పరీక్షించగా 17,354 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 64 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,01,690కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,22,980 మంది చికిత్స పొందుతుండగా 9,70,718 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 8,468 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,992కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,63,90,360 శాంపిల్స్ పరీక్షించారు.