తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. నేడు ఎన్ని కేసులంటే..!

Tuesday, August 11th, 2020, 10:30:53 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,896 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 8 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,788 మంది డిశ్చార్జ్ చేయారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,647 చేరగా, కరోనా నుంచి కోలుకుని 59,374 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 22,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 645కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 18,035 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 6,42,875 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉందని హెల్త్ బులెటిన్ తెలిపింది.