హెల్త్ బులెటిన్: తెలంగాణలో నేడు కాస్త తగ్గిన కరోనా కేసులు..!

Monday, September 7th, 2020, 10:49:45 AM IST

తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా నేడు కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటలలో 1,802 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా 9 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,711 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,771 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,10,241 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 31,635 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 895 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 36,593 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 17,66,982 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 77.2 శాతం ఉండగా, మరణాల రేటు 0.62% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.