తెలంగాణలో 60 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. నేడు ఎన్నంటే?

Thursday, July 30th, 2020, 11:06:03 AM IST

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా గడిచిన 24 గంటల్లో 1,811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే కరోనా బారిన పడి నేడు 13 మంది చనిపోగా, కరోనా నుంచి కోలుకుని నేడు ఒక్కరోజే 821 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,717 చేరగా, కరోనా నుంచి కోలుకుని 44,572 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 15,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 505కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 18,263 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 4,16,202 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 73.4 శాతంగా ఉందని, మరణాల రేటు 0.83 శాతంగా ఉందని హెల్త్ బులెటిన్ తెలిపింది.