భారత్‌లో కొత్తగా 18,327 కేసులు.. 108 మంది మృతి..!

Saturday, March 6th, 2021, 02:42:35 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ మెల్లగా పెరుగుతుంది. దేశ వ్యాప్తంగా కరోనాకు టీకా అందుబాటులోకి రావడంతో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో దీంతో కథ మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,327 కరోనా కేసులు నమోదు కాగా, 108 మంది కరోనా బారిన పడి మరణించారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,92,088కి చేరింది. ప్రస్తుతం అందులో 1,80,304 యాక్టివ్ కేసులు ఉండగా, 1,08,54,128 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,57,656 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 14,234 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 97 శాతం ఉండగా, మరణాల రేటు 1.4 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.