ఏపీలో కొత్తగా 18,561 కరోనా కేసులు.. మరో 109 మంది మృతి..!

Monday, May 17th, 2021, 08:10:14 PM IST


ఏపీలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో 83,749 శాంపిల్స్‌ని పరీక్షించగా 18,561 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 109 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,54,052కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 2,11,554 మంది చికిత్స పొందుతుండగా 12,33,017 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 17,334 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,481కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,80,49,054 శాంపిల్స్ పరీక్షించారు.