కరోనా అప్డేట్: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Monday, October 26th, 2020, 07:42:10 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గాయి. అయితే గడిచిన 24 గంటలలో 51,544 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 1,901 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 19 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,08,924 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 28,770 మంది చికిత్స పొందుతుండగా 7,73,548 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 3,972 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,606 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 76,21,896 శాంపిల్స్ పరీక్షించారు.