తెలంగాణలో కరోనా కల్లోలం.. జిల్లాలలోనే ఎక్కువ కేసులు..!

Friday, August 14th, 2020, 09:55:41 AM IST

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కాస్త కేసులు తగ్గినా జిల్లాలలో మాత్రం ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,921 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 9 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,210 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,396 చేరగా, కరోనా నుంచి కోలుకుని 64,284 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 23,438 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 674కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 22,046 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 7,11,196 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 72.72 శాతంగా ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.