ఏపీలో కొత్తగా మరో 199 కరోనా కేసులు.. ఒకరు మృతి..!

Saturday, January 9th, 2021, 08:30:48 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 50,445 శాంపిల్స్‌ని పరీక్షించగా 199 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన నేడు ఒక్కరే మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,689 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 2,607 మంది చికిత్స పొందుతుండగా 8,74,954 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 423 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,128 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,22,74,647 శాంపిల్స్ పరీక్షించారు.