హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా మరో 2,072 పాజిటివ్ కేసులు..!

Tuesday, September 29th, 2020, 09:30:17 AM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ నేడు పెరిగింది. గత కొద్ది రోజులుగా రోజుకు 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా నిన్న కాస్త ఆ సంఖ్య తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటలలో 2,072 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 9 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,259 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,89,283 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,58,690 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 29,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1116 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 54,308 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 29,40,642 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 83.83 శాతం ఉండగా, మరణాల రేటు 0.58% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.