హెల్త్ బులెటిన్: తెలంగాణలో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు..!

Tuesday, September 22nd, 2020, 08:44:58 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న కేసుల సంఖ్య కాస్త తగ్గిందనుకున్నా నేడు ఆ సంఖ్య మళ్ళీ పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటలలో కేవలం 2,166 పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా నేడు మరో 10 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,143 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,774 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,44,073 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 29,649 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,052 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 53,690 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 25,73,005 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 82.43 శాతం ఉండగా, మరణాల రేటు 0.60% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.