భారత్‌లో కరోనా విళయతాండవం.. నేడు మరింత పెరిగిన పాజిటివ్ కేసులు..!

Saturday, April 17th, 2021, 11:04:10 AM IST

india_corona

భారత్‌లో కరోనా విళయతాండవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా గత నాలుగైదు రోజుల నుంచి 2 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,34,692 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి కొత్తగా 1,341 మంది మృతి చెందారు.

దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. అయితే ప్రస్తుతం అందులో 16,79,740 యాక్టివ్ కేసులు ఉండగా, 1,26,71,220 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,75,649 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 1,23,354 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 87.2 శాతం ఉండగా, మరణాల రేటు 1.2 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.