తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. నేడు మరో 2,392 కేసులు..!

Tuesday, September 8th, 2020, 10:01:56 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తాజాగా గడిచిన 24 గంటలలో 2,392 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 11 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,346 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,163 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,12,587 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 31,670 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 906 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 60,923 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 18,27,905 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 77.5 శాతం ఉండగా, మరణాల రేటు 0.62% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.