తెలంగాణలో కరోనా కల్లోలం.. నేడు కొత్త కేసులు ఎన్నంటే..!

Saturday, September 5th, 2020, 10:00:24 AM IST

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత వారం రోజుల నుంచి భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటలలో 2,511 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 11 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,579 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,395 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,04,603 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 877 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 62,132 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 16,67,653 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 75.5 శాతం ఉండగా, మరణాల రేటు 0.63% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.