ఏపీలో కొత్తగా మరో 3,309 కరోనా కేసులు.. మరో 12 మంది మృతి..!

Saturday, April 10th, 2021, 10:00:28 PM IST

ఏపీలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 31,929 శాంపిల్స్‌ని పరీక్షించగా 3,309 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన నేడు ఏకంగా 12 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,21,906 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 18,666 మంది చికిత్స పొందుతుండగా 8,95,949 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 1,053 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,291కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,97,672 శాంపిల్స్ పరీక్షించారు.