ఏపీలో కొత్తగా 3,342 పాజిటివ్ కేసులు.. మరో 22 మంది మృతి..!

Saturday, October 24th, 2020, 06:30:49 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గాయి. అయితే గడిచిన 24 గంటలలో 74,919 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 3,342 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 22 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,04,026 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 31,469 మంది చికిత్స పొందుతుండగా 7,65,991 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 3,572 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,566 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 75,02,933 శాంపిల్స్ పరీక్షించారు.