భారత్‌లో ఆగని కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Saturday, December 5th, 2020, 12:14:04 PM IST

భారత్‌లో కరోనా కేసుల ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో రోజుకు లక్షకు చేరువలో కొత్త కేసులు నమోదవుతుండగా, వెయ్యికి పైగా మరణాలు నమోదు అయ్యేవి. అయితే ఇప్పుడు అది కాస్త తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 36,652 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో 512 మంది చనిపోయారు. అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 96,08,211 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 4,09,689 యాక్టివ్ కేసులు ఉండగా, 90,58,822 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 1,39,700 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇక నిన్న దేశవ్యాప్తంగా 42,533 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,57,763 శాంపిల్స్ మాత్రమే పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 94.3 శాతం ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.