ఏపీలో నేడు భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Monday, June 7th, 2021, 07:32:39 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఇంకా మరణాల సంఖ్య మాత్రం అదుపులోకి రావడం లేదు. అయితే గడిచిన 24 గంటలలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మొత్తం 64,800 శాంపిల్స్‌ని పరీక్షించగా 4,872 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 86 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,63,211కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,14,510 మంది చికిత్స పొందుతుండగా, మరో 16,37,149 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 13,702 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11,552కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,98,56,521 శాంపిల్స్ పరీక్షించారు.