ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. గడిచిన 24 గంటల్లో 5 వేలకు పైగా కేసులు..!

Friday, April 16th, 2021, 03:00:39 AM IST

AP_corona

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కొద్ది రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 35,741 శాంపిల్స్‌ని పరీక్షించగా 5,086 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 14 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,42,135 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 31,710 మంది చికిత్స పొందుతుండగా 9,03,072 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 1,745 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,353కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,55,70,201 శాంపిల్స్ పరీక్షించారు.