తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి రెండు వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటలలో కూడా కేవలం 596 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కరోనా కారణంగా నేడు ముగ్గురు చనిపోయారు. ఇక కరోనా నుంచి నేడు మరో 921 మంది కోలుకున్నారు.
అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,72,719 కి చేరింది. ఇక ఇప్పటివరకు 2,62,751 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 8,498 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,470 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 59,471 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 57,22,182 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 96.34 శాతం ఉండగా, మరణాల రేటు 0.53% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.