తెలగాణలో నేడు భారీగా నమోదైన కరోనా కేసులు.. ముగ్గురు మృతి..!

Monday, May 25th, 2020, 09:45:36 PM IST


తెలంగాణలో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతుంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండగా నేడు ఆ సంఖ్య మరింత భారీగా పెరిగింది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు 66 కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా బారిన పడి నేడు కూడా ముగ్గురు మృతి చెందగా, కరోనా నుంచి కోలుకుని నేడు 72 మంది డిశ్చార్జ్ అయ్యారు.

జీహెచ్ఎంసీ పరిధిలో నేడు 31 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో ఒకరికి, వలస కూలీలలో 15 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి, మహారాష్ట్ర వాసికొకరికి పాజిటివ్ అని తేలింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1920 కి చేరగా, 1164 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇటు మరణాల సంఖ్య మొత్తం 56కు చేరింది.