ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు.. మరో 7 మంది మృతి..!

Wednesday, December 2nd, 2020, 10:00:03 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గతంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా కొద్ది రోజుల నుంచి ఆ సంఖ్య మరింత తగ్గింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 56,988 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 663 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి మరో 7 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,69,412 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 6,924 మంది చికిత్స పొందుతుండగా 8,55,485 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 1,159 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,003 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,01,66,696 శాంపిల్స్ పరీక్షించారు.