తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. నేడు 74 పాజిటివ్ కేసులు..!

Saturday, May 30th, 2020, 11:06:07 PM IST

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూపోతుంది. గత వారం రోజులుగా రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం నేడు కూడా 74 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అయితే జీహెచ్ఎంసీలో 41 పాజిటివ్ కేసులు, రంగారెడ్డిలో 5 కేసులు, సంగారెడ్డిలో 3 కేసులు, మహబూబ్‌నగర్, జగిత్యాల రెండేసి కేసులు, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌లో ఒక్కో కేసు నమోదు అయ్యింది. ఇకపోతే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2499 కి చేరగా, 1412 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 1010 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇటు మరణాల సంఖ్య మొత్తం 77కి చేరింది.