ఏపీలో కొత్తగా 8,239 పాజిటివ్ కేసులు.. మరో 61 మంది మృతి..!

Friday, June 11th, 2021, 07:48:34 PM IST


ఏపీలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నా ఇంకా మరణాల సంఖ్య మాత్రం అదుపులోకి రావడం లేదు. అయితే గడిచిన 24 గంటలలో 1,01,863 శాంపిల్స్‌ని పరీక్షించగా 8,239 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 61 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,96,122కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 96,100 మంది చికిత్స పొందుతుండగా, మరో 16,88,198 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 11,135 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11,824కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,02,39,490 శాంపిల్స్ పరీక్షించారు.