తెలంగాణలో కరోనా బీభత్సం.. నేడు కొత్తగా 872 పాజిటివ్ కేసులు..!

Monday, June 22nd, 2020, 09:38:31 PM IST

తెలంగాణలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన ప్రకారం నేడు ఒక్కరోజే 872 కొత్త కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి నేడు మరో ఏడుగురు చనిపోయారు.

అయితే ఇవాళ ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 713 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 107 కేసులు, మేడ్చల్‌లో 16 కేసులు, సంగారెడ్డిలో 12 కేసులు, వరంగల్ రూరల్‌లో 6 కేసులు, మంచిర్యాలలో 5 కేసులు, కామారెడ్డి, మెదక్‌లో 3 కేసులు, మహబూబ్‌నగర్‌లో 2 కేసులు, వరంగల్ అర్బన్‌లో ఒక కేసు నమోదయ్యింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674 కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 4,005 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 4,452 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 217కి చేరింది.

ఇదిలా ఉంటే ఈ రోజు మొత్తం 3,189 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 2,317 మందికి నెగెటివ్ రాగా, 872 మందికి పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 60,243 టెస్ట్‌లు చేసినట్లు తెలుస్తుంది.