ఏపీలో కొత్తగా 8,766 పాజిటివ్ కేసులు.. మరో 67 మంది మృతి..!

Wednesday, June 9th, 2021, 09:48:46 PM IST


ఏపీలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఇంకా మరణాల సంఖ్య మాత్రం అదుపులోకి రావడం లేదు. అయితే గడిచిన 24 గంటలలో 93,511 శాంపిల్స్‌ని పరీక్షించగా 8,766 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా బారిన పడి నేడు మరో 67 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,79,773కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 1,03,995 మంది చికిత్స పొందుతుండగా, మరో 16,64,082 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని మరో 12,292 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11,696కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,00,39,764 శాంపిల్స్ పరీక్షించారు.