తెలంగాణలో కరోనా కల్లలోం.. పది వేలు దాటిన కేసుల సంఖ్య..!

Wednesday, June 24th, 2020, 09:57:20 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నేడు కూడా 891 కొత్త కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి నేడు మరో 5 మంది చనిపోయారు.

అయితే ఇవాళ ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 719 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 86 కేసులు, మేడ్చల్‌లో 55 కేసులు, భద్రాదిలో 6 కేసులు, ఖమ్మంలో 4 కేసులు, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్‌లో మూడేసి కేసులు, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండలో రెండేసి కేసులు, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబాబాద్, అదిలాబాద్‌లో ఒక్కో కేసు నమోదయ్యింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,444కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 4,361 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 5,858 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 225కి చేరింది.
ఇదిలా ఉంటే ఈ రోజు మొత్తం 4,069 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 3,178 మందికి నెగిటివ్ రాగా, 891 మందికి పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 67,318 టెస్ట్‌లు చేసినట్లు తెలుస్తుంది.