భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. నేడు కొత్త కేసులు ఎన్నంటే?

Friday, September 18th, 2020, 10:30:36 AM IST

భారత్‌లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 96,424 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,14,677 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 10,17,754 యాక్టివ్ కేసులు ఉండగా, 41,15,551 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,174 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 84,372 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 87,472 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 10,06,615 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 78.9 శాతం ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.