తెలంగాణలో కరోనా విజృంభణ.. నేడు కొత్తగా మరో 975 కేసులు..!

Monday, June 29th, 2020, 08:55:22 PM IST


తెలంగాణలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నేడు కొత్తగా మరో 975 కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి నేడు మరో 6 మంది చనిపోయారు.

అయితే ఇవాళ ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 861 కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 40 కేసులు, మేడ్చల్‌లో 20 కేసులు, సంగారెడ్డిలో 14 కేసులు, కరీంనగర్‌లో 10 కేసులు, వరంగల్ రూరల్‌లో 5 కేసులు, వరంగల్ అర్బన్‌లో 4 కేసులు, మహబూబ్‌నగర్‌లో 3 కేసులు, నల్గొండ, కామారెడ్డి, యాదాద్రిలో రెండేసి కేసులు, సిద్దిపేట, అసిఫాబాద్, గద్వాల్, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు నమోదు అయ్యింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,394కి చేరగా, కరోనా నుంచి కోలుకుని 5,582 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 9,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 253కి చేరింది.

ఇదిలా ఉంటే ఈ రోజు మొత్తం 2,648 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 1,673 మందికి నెగిటివ్ రాగా, 975 మందికి పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 85,106 టెస్ట్‌లు చేశారు.