భారత్‌లో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా మరణాలు..!

Friday, August 14th, 2020, 11:41:26 AM IST

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే నేడు ఆల్‌టైం రికార్డ్ కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 24,61,191 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 6,61,595 యాక్టివ్ కేసులు ఉండగా, 17,51,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,007 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 48,040కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 8,48,728 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 71.2 శాతం ఉండగా, మరణాల రేటు 2 శాతంగా ఉంది.