ధరణి పోర్టల్ రూపకల్పనపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష..!

Tuesday, September 22nd, 2020, 10:01:35 AM IST

కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి పోర్టల్‌ రూపకల్పనపై నేడు సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూశాఖకు సంబంధించి ధరణి పోర్టల్‌ను కొత్తగా రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. అయితే నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో పోర్టల్‌లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేస్తోంది.

అయితే కొత్త రెవెన్యూ చట్టం అమలు, విధివిధానాలపై సమావేశంలో సీఎం అధికారులతో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. పట్టణ, పురపాలక పన్నురికార్డులను అనుసంధానం చేసే అంశంపైనా కూడా చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాదు భూదస్త్రాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.