ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. కానీ చిన్నపాటి ఊరట..!

Saturday, April 4th, 2020, 03:00:33 AM IST

ఏపీలో గత రెండు రోజులుగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. అయితే తాజాగా నిన్న రాత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం సాయంత్రం పది 10:30 గంటలకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 164గా ప్రకటించింది.

అయితే తూర్పుగోదావరి జిల్లాలో 2 పాజిటివ్ కేసులు, విశాఖపట్నంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఏపీలో కరోనా బారిన పడిన రెండవ పేషంట్ ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందాడు. అయితే ప్రోటోకాల్ ప్రకారం బాధితుడికి మూడుసార్లు కరోనా నెగిటివ్ రావడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు. ఇక పేషెంట్ నెంబర్ 4, (తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు) కూడా యూకే నుంచి వచ్చి కరోనాతో కాకినాడ జీజీహెచ్‌లో చేరాడు. అతడికి వైద్యుల బృందం చికిత్స అందించింది. అతడికి కూడా వరుసగా మూడుసార్లు కరోనా నెగిటివ్ రిజల్ట్స్ రావడంతో ఈరోజు డిశ్చార్జ్ చేశారు. అయితే వీరితో కలిపి ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4కు చేరింది.