రుణమాఫీపై భవితవ్యం తేలేది నేడే..

Monday, September 29th, 2014, 11:29:32 AM IST


రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ఓ నిర్ణయం తీసుకోనున్నది. ఈ రోజు తీసుకునే నిర్ణయంమేరకు రుణాలమాఫీ అమలు ఉంటుంది. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రుణాల మాఫీపై చర్చించనున్నారు. రుణాలను విడతలవారీగా చెల్లిస్తామని.. అందుకుఅనుకూలంగా బ్యాంకులు రైతుల రుణాలను మాఫీ చేయాలని చంద్రబాబు నాయుడు బ్యాంకర్లను కోరనున్నారు.

అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద రుణాలమాఫీ కోసం కేవలం 6వేల కోట్ల రూపాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా మొత్తాన్ని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నది. కాని, ఈ రోజు సాయంత్రం జరగబోయే.. సమావేశంలో బ్యాంకర్లు తెసుకునే నిర్ణయం మేరకు.. రైతురుణాల మాఫీ ఆధారపడి ఉండనున్నట్టు తెలుస్తున్నది. కాగ, ఈ నెలాఖరులోగా రుణాలు చెల్లించని పక్షంలో 14శాతం వడ్డీ భారం తప్పదని ఇప్పటికే బ్యాంకులు హెచ్చరించిన విషయం తెలిసిందే.