కరోనా అప్డేట్: భారత్‌లో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు..!

Thursday, September 17th, 2020, 11:11:11 AM IST

భారత్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 97,894 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 51,18,254 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 10,09,976 యాక్టివ్ కేసులు ఉండగా, 40,25,079 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,132 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 83,198 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 82,719 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,36,613 శాంపిల్స్ పరీక్షించారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 78.64 శాతం ఉండగా, మరణాల రేటు 1.63 శాతంగా ఉంది.