బ్రేకింగ్: ఏపీలో నేడు కూడా పదివేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు..!

Thursday, July 30th, 2020, 07:02:10 PM IST


ఏపీలో కరోనా విళయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా నిన్న ఏకంగా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మార్క్ దాటింది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 70,068 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,167 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 68 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని 4,618 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1,30,557 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 69,252 మంది చికిత్స పొందుతుండగా, 60,024 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1281కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,90,077 శాంపిల్స్ పరీక్షించారు.