బిగ్ రిపోర్ట్: ఏపీలో నేడు కూడా పదివేలు దాటిన పాజిటివ్ కేసులు..!

Friday, July 31st, 2020, 06:20:24 PM IST

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా రెండు రోజులుగా ఏకంగా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మార్క్ దాటుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 61,699 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,376 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే నేడు ఒక్కరోజే కరోనా బారిన పడి 68 మంది మృత్యువాత పడగా, కరోనా నుంచి కోలుకుని 3,822 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1,40,933 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 75,720 మంది చికిత్స పొందుతుండగా, 63,864 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1349కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,51,776 శాంపిల్స్ పరీక్షించారు.