ఇక నుంచి క్యాస్టింగ్ కౌచ్ భయం ఉండదు

Friday, May 11th, 2018, 11:59:44 AM IST

గత కొంత కాలంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇకనుండి అలాంటివేమీ జరగకుండా ఉండేందుకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పలు విధాలా ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే మహిళల సంరక్షణ కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే క్యాస్టింగ్ కౌచ్ భారిన పడకుండా అమ్మాయిలకు ఈజీగా అవకాశాలు దొరికేలా సినీ ప్రముఖులు ఓ కొత్త యాప్ ను తాయారు చేశారు. ఆ యాప్ ను దర్శకుడు మారుతి గురువారం లాంచ్ చేశారు.

సెలబ్ కనెక్ట్ పేరుతో తయారు చేసిన ఈ యాప్ లో యువత వారి పేరును వివరాలను నమోదు చేస్తే సినీ ప్రముఖులు నచ్చితే వారిని యాప్ ద్వారా సంప్రదిస్తారు. అమ్మాయిలైతే ముందుగా వారి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టాలెంట్ ఉన్నవాళ్లు ఆఫీస్ ల చుట్టు తిరగకుండా ఈ యాప్ ను ఫాలో అయితే చాలాని మారుతి వివరించారు. యాప్‌ను సంస్థ సీఈవో సుమన్, నటి సెబ కోషి, చిత్ర దర్శకుడు మనో వికాస్‌లతో కలిసి మారుతి జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీ కార్యాలయంలో స్టార్ట్ చేశారు. ప్లే స్టోర్ నుంచి సెలబ్ కనెక్ట్ యాప్ ను ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చ్చు.