పొలిటికల్ చిత్రంలో నటించనున్న టాలీవుడ్ క్రేజీ హీరో?

Monday, March 5th, 2018, 07:20:03 PM IST

పెళ్ళిచూపులుతో టాలీవుడ్ లో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత చేసిన ద్వారకా చిత్రం పెద్దగా ఆడలేదు. అయితే తదనంతరం వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంతటి ఘనవిజయం అందుకుందో అందరికి తెలిసిందే. ఆ చిత్రం తో ఆయనకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభమైంది. ఆనంద్‌ శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విజయ్‌కి జోడీగా మెహరీన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇందులో ఎంత నిజం ఉందొ తెలియదుగాని, అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రంలో విజయ్‌ రాజకీయనేతగా నటించనున్నాడట. రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని, నాయకుడిగా ప్రజల్లో అభిమానం సంపాదించుకున్న విజయ్‌ తండ్రి చనిపోతే, ఆయన స్థానంలో విజయ్‌ బాధ్యతలు స్వీకరించే నేపథ్యంలో సినిమా ఉంటుందని కథనాలు వినిపిస్తున్నాయి. చూస్తుంటే ఒకరకంగా ఇదివరకే వచ్చిన రానా లీడర్ చిత్రం మాదిరిగా ఉందని తెలుస్తోంది. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే రాజకీయాల నేపథ్యంలో ‘భరత్‌ అనే నేను’, ‘ఎంఎల్‌ఏ’ సినిమాలు రాబోతున్నాయి…..