క్రిష్ ను టెన్షన్ పెడుతున్న శంకర్?

Wednesday, May 30th, 2018, 02:18:51 PM IST

టాలీవుడ్ లో అనే కాకుండా ఇతర ఇండస్ట్రీల వారు కూడా ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 సినిమా కోసం చాలానే ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గత ఏడాది నుంచి రిలీజ్ విషయంలో అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయ్యి ఏడాది కావొస్తున్నా ఇంకా రిలీజ్ విషయంలో దర్శకుడు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఎందుకంటే గ్రాఫిక్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడం లేదు. దీంతో రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ నెలకొంది.

ఇటీవల అందిన సమాచారం ప్రకారం.. సినిమాను అగస్ట్ 15న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారట. అయితే అంతకుముందే క్రిష్ మణికర్ణిక సినిమాను అదే తేదీనాడు రిలీజ్ చెయ్యాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు శంకర్ సూపర్ స్టార్ సినిమాను తెస్తున్నారని మణికర్ణికను సెప్టెంబర్ కి షిఫ్ట్ చేశారు.ఇక మళ్లీ మరో రూమర్ క్రిష్ ని భయపెడుతోందట. ఎందుకంటే 2.0 సెప్టెంబర్ ని టార్గెట్ చేసిందని చెబుతుండడంతో క్రిష్ సైలెంట్ అయ్యాడట. ఫైనల్ గా శంకర్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసేవరకు ఒకే చేయకూడదని డిసైడ్ అయ్యాడట. కంగనా రనౌత్ నటిస్తున్న మణికర్ణిక సినిమా ఝాన్సీ రాణి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments